Friday, January 31, 2025

Jan 2025 Diary

 

📖 01.01.2025 ✍️ (బుధ) 11220 

🏡:- కేంద్ర, ఆంధ్రజ్యోతి

"సదాశివ సన్యాసి" అనే పాట వింటూ, చేతిలో శ్రీరాముని చూస్తూ నడుస్తూ 2025 నూతన సంవత్సరంలో ప్రవేశించాను

శివ గారితో పాటు, సాక్షి కార్యాలయం మీదుగా, ఖైరతాబాద్ వచ్చి అక్కడ నుంచి కేంద్రాకు వచ్చాను. ప్రాతః స్మరణీయం సూర్య నమస్కారాలు పాక్షికంగా చేశాను. అలసట కారణంగా కార్యాలయంలో రా.09.30 గం.లకు పడుకున్నాను శ్రీరామ.

—----------

📖 02.01.2025 ✍️ 11221 (గురువారం)

🏡:- హైదరషాకోటి

 

ఉదయాన్నే కార్యాలయం నుంచి లక్ష్మీ అత్త వాళ్ళ ఇంటికి విశ్రాంతి తీసుకునేందుకు వచ్చాను శ్రీరామ.

—----------

📖 03.01.2025 ✍️ 11222 (శుక్రవారం)

🏡:- హైదరషాకోట్, ఆంధ్రజ్యోతి 


హిందూ అరబిక్ అంకెల పద్ధతి గురించి ఉదయం వరకు మేల్కొని రాశాను. కార్యాలయంలో వృత్తి కాల పట్టికకు సంబంధించిన చర్చ జరిగింది. సాయి నా కోసం లోగో రూపాంతరం చేశాడు శ్రీరామ.

—----------

📖 04.01.2025 ✍️ 11223 (శనివారం)

🏡:- హైదరషాకోటి, ఆంధ్రజ్యోతి 


నేను కళత్త కొద్దిసేపు సెల్లారులో మాట్లాడుకున్నాము.

కార్యాలయంలో ఎక్సెల్ షీట్ నవీకరించాను శ్రీరామ.

—----------

📖 05.01.2025 ✍️ 11224 (ఆదివారం)

🏡:- హైదరషాకోటి, సైనికపురి, డిమార్టు, ఆంధ్రజ్యోతి, కేంద్ర


నాన్న హైదరాబాద్ వచ్చారు, అత్తాపూర్ నుంచి నాన్న తీసుకువచ్చాను. శ్యామ అన్న, శ్రీనివాస్ బాబాయ్ వాళ్ళు  "ఫ్రెండ్స్ ఆఫ్ నేచర్ సోసైటీ"కు సంబంధించిన సంతకం కోసం లక్ష్మత్త వాళ్ళ ఇంటికి వచ్చారు. పెద్దనాన్న దగ్గరకు వెళ్ళాము, వయా వివేకానంద కేంద్ర.  నాన్నను బస్సు ఎక్కించి, డిమార్టు వెళ్లి, ఆంధ్రజ్యోతికి వెళ్లి, రైల్వే ప్రకటన చేసి, కేంద్రాకు వెళ్లాను శ్రీరామ.


అరటి పండ్లకు సంబంధించిన సందర్భం.

—----------

📖 06.01.2025 ✍️ 11225 (సోమ)

🏡:- ఆంధ్రజ్యోతి, కేంద్ర


పవన్ తో ప్రాతః స్మరణీయం చేసాను, వాడు ఈరోజు నాకు చాలా బాగా నచ్చాడు.

రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రానికి వెళ్లి, దంతానికి చికిత్స చేయించుకున్నాను. 

నిన్న పెదనాన్న పెట్టిన ప్రతిపాదనకు పాక్షిక ఆమోదం తెలుపుతూ రెండు రోజులు ఉంటానని నిర్ణయాన్ని తీసుకొని అమ్మకు చెప్పాను. ఆంధ్రజ్యోతిలో రసూల్ స్వామి 1500 వేసారు శ్రీరామ.

—----------

📖 07.01.2025 ✍️ 11226 (మంగళ)

🏡:- కేంద్ర, ఆంధ్రజ్యోతి, రాజీవనగర్ 


రవి అగ్రజులు హైదరాబాద్ వచ్చారు, ప్రాతః స్మరణీయం చేసాము. పెద్దనాన్న ప్రతిపాదనకు పాక్షిక ఆమోదం తెలిపాను. 

రాత్రి వీరాను అమీరపేటలో వదిలి జ్యోతక్క వాళ్ళ ఇంటికి వచ్చాను శ్రీరామ.

—----------

📖 08.01.2025 ✍️ 11227 (బుధ)

🏡:- రాజీవనగర్, ఆంధ్రజ్యోతి, సైనికపూరి


బావ, నేను ఓ మంచి టీ తాగాము. ఇంట్లోనే ఉన్న లహిరితో వినాయక సీరియల్ చూసాను. రామకృష్ణ స్వామితో సైనికపూరికి వచ్చాను శ్రీరామ.

—----------

📖 09.01.2025 ✍️ 11228 (గురు)

🏡:- ఆంధ్రజ్యోతి, సైనికపూరి

పెదనాన్న నాకోసం పాల ప్యాకెట్ తీసుకొచ్చారు, ముద్దపప్పు వండారు. జీతం పడింది. ఆంధ్రజ్యోతిలో చేరి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యింది శ్రీరామ.

—----------

📖 10.01.2025 ✍️ 11229 (శుక్ర)

🏡:- సైనికపూరి, ఆంధ్రజ్యోతి, కేంద్ర


పెద్దనాన్న పాన్ కార్డు తీసుకువచ్చాను, పెదనాన్న డబ్బులు పుస్తకంలో పెట్టాను. వైకుంఠ ఏకాదశి అయిన ఈ రోజున పాక్షిక ఉపవాసం ఉన్నాను. రాత్రంతా మేలుకొని ఉన్నాను శ్రీరామ.

—----------

📖 11.01.2025 ✍️ 11230 (శని)

🏡: కేంద్ర, ఆంధ్రజ్యోతి, హైదరషాకోట్


నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము 7.30 వరకు మేల్కొని పాటలు వింటూ, ఇల్లు సర్దుతూ ఆనందంగా గడిపాను. 

ఉదయాన్నే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మ్యాగీ చేసుకుని ఆంధ్రజ్యోతికి బయలుదేరాను శ్రీరామ.

—----------

📖 12.01.2025 ✍️ 11231 (అది)

🏡:- హైదరషాకోట్, కౌశలం, ఉప్పల్


పిల్లలకు అల్పాహారం అందించి, వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కౌశలానికి వెళ్లాను. కేవలం పేరుకే వెళ్లినందుకు ముఖేష్ గారికి క్షమాపణలు చెప్పి, ఇంటికి వచ్చి శిరీషత్త, చందు మామ, పార్థు మామ, ధ్రువ విరాట్ ప్రణవులతో సుహాసిని వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 

హరి అన్నయ్య, శివ మామయ్య, సుహాసిని వదినలు ఆతిథ్యం బాగా నచ్చింది. 

సంజు, సన్నీ, ధ్రువ, విరాట్, ప్రణవ్, చందు మామ, సిరి అత్త, కార్తీకలతో క్రికెట్ షటిల్ ఇలాంటి ఆటలు బాగా ఆడాను. అందరం బాగా ఆడుకున్నాను, కలిసి సమయాన్ని గడిపాము.  రాత్రి అపార్ట్మెంట్ చుట్టూ పాటలు వింటూ తిరగడం, రామకృష్ణ తో మాట్లాడడం స్వాంతన కలిగించింది శ్రీరామ.

—----------

📖 13.01.2025 ✍️ 11232 (సోమ)

🏡:- హైదరషాకోట్, ఆంధ్రజ్యోతి, ప్రయాణం*


ఉదయాన్నే తొందరగా లేచి, కాఫీ తాగి, ప్రణవుని లేపి భోగిమంటలు వేసాను. 

భోగిమంటల తర్వాత బండి శుభ్రం చేసి, అపార్ట్మెంట్ పరిభ్రమణంగా తిరిగాను. 

ఆంధ్రజ్యోతిలో ప్రశాంతంగా ఎల్లుండి ప్రకటనలు చేసుకున్నాం. 

స్వాతి కోరిక మీద హఠాబిడిగా కడప కి వెళ్ళేందుకు నిర్ణయం తీసుకుని ప్రత్యేక రైలులో కడపకు బయలుదేరింది సిద్దమయ్యాను. 

రవి అన్న, రవి, రఘు, శివగార్లతో మెఫిల్ వెళ్లి టీ తాగి కాచిగూడ వచ్చాను.

పార్కింగ్ ప్రయత్నాలలో విఫలమై, సాయి సహాయంతో బండిని నిలిపి రైల్వే స్టేషన్ కి వచ్చాను శ్రీరామ.

—----------

📖 14.01.2025 ✍️ 11233 (మంగళ)

🏡:- కాచిగూడ, కడప, ఐటిఐ  


తెల్లవారుజామున 1.40 కు రైలులో కడపకు బయలుదేరాను. సైడ్ లోయరు సీటు దొరకడంతో ప్రశాంతంగా కూర్చుని పడుకుని కడప చేరాను. చాలా రోజుల తర్వాత పగటి పూట రైలు ప్రయాణం చేశాను. 

బావతో లైఫ్ స్టైల్ వెళ్లాను, తరువాత రాజీవ్ మార్గ్ దగ్గర పెళ్లికి సంబంధించిన మాటలు విషయాలు మాట్లాడుకుందాం. 

యజ్ఞశ్రీతో మాట్లాడాలి అనే నిర్ణయానికి వచ్చాను శ్రీరామ.

—----------

📖 15.01.2025 ✍️ 11234 (బుధ)

🏡:- కడప


సూధీర్ స్వామి వచ్చి కర్మంతరాలు జరిపించారు.

యజ్ఞశ్రీతో 33 ని.లు మాట్లాడాను, మొదటి అభిప్రాయం, చాలా సానుకూలంగా అనిపించింది. పాటలతో మధ్యాహ్నం అలా బయట తిరిగాను. నేను బావ మసాలా పూరీ తిన్నాము. పెళ్లి యజ్ఞ విషయాలు మాట్లాడుకున్నాం శ్రీరామ.

—----------

📖 16.01.2025 ✍️ 11235 (గురు)

🏡 హైదరాబాద్, సైనికపూరి, ఆంధ్రజ్యోతి, రాజీవ నగర్


12 గం.లకు అభిరామ బావకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి, చిత్రాలు తీసుకున్నాము. 12.40కు కడప బస్ స్టాండుకు వచ్చి 1.30కు బస్సు ఎక్కి హైదరాబాద్ బయలుదేరాను. ఉదయం తొమ్మిది గంటలకు మగాబని లో బస్సు దిగి, నారాయణగూడకు మెట్రోలో వెళ్లి, అక్కడ బండి తీసుకొని, బండిలో సైనికపురి కి వెళ్ళాను. లక్ష్మత్తతో యజ్ఞశ్రీ గురించి చెప్పాను. కవిత వదిన ఆర్యలను కలిశాను శ్రీరామ.

—----------

📖 17.01.2025 ✍️ 11236 (శుక్ర)

🏡 రాజీవ నగర్, ఆంధ్రజ్యోతి, కేంద్ర 


జ్యోతి అక్కతో యజ్ఞశ్రీ గురించి మాట్లాడాను. అమ్మతో ప్రతికూల ఆలోచనల గురించి చర్చ. ఆంధ్రజ్యోతిలో నేను నరేష్ మాత్రమే దాదాపు ఫ్రూప్ రీడింగ్ చేసాము. వీరాను వదిలి కేంద్రకు వచ్చాను శ్రీరామ.

—----------

📖 18.01.2025 ✍️ 11237 (శని) 

🏡 కేంద్ర, ఆంధ్రజ్యోతి, హైదరషాకోట


రవి అగ్రచుడితో ప్రాతః స్మరణీయం సూర్య నమస్కారాలు చేసి పెళ్లి విషయం చెబుతూ ఉంటే తన శుభం అంటూ ప్రతిస్పందించారు. 

ఆలు, సొరకాయ, పల్లీల పొడితో చేసుకున్నాను. 

భరద్వాజ ఆర్యని రైలు ప్రకటన విషయంలోఅన్ ప్రెడిక్టబుల్ (ఊహకందనివారు) అంటూ సంభోదించాను. 

రాత్రి 10: 15 నుంచి 11:10 వరకు పాటలు వింటూ తాదాత్మ్యంగా తిరిగాను.

హైదరషాకోటకు వయా టోలిచౌకి మీద నుంచి ఇల్లు(పార్థసారధి తాత) చేరి అక్కడ పడుకున్నాను శ్రీరామ.

—----------

📖 19.01.2025 ✍️ 11238 (ఆది)

🏡 హైదరషాకోట్, సైనికపురి, కేంద్ర


మంగ నానమ్మ వాళ్ళ ఇంట్లో అల్పాహారం తీసుకుని, బండి పంచర్ అయితే టైరు మార్పించుకొని, భోజనం చేసి సైనికపురి కు వెళ్లాను. బండి పంచరు విషయంలో తిక్కగా అనిపించింది. 

వంశి అన్నయ్య వదినలను కలిసి, ప్రియక్కతో పెద్దనాన్న దగ్గరికి వచ్చి కుటుంబం పెళ్లి యజ్ఞశ్రీ ఇతరత్రా విషయాలు మాట్లాడుకున్నాము. 

ప్రియక్క చేసిన చపాతీలు తిని కేంద్ర కు వచ్చి యజ్ఞశ్రీతో లిఖిత పూర్వక సంభాషణలు జరిపాను శ్రీరామ.

—----------

📖 20.01.2025 ✍️ 11239 (సోమ)

🏡 కేంద్ర, ఆంధ్రజ్యోతి 


ఆంధ్రజ్యోతిలో కరుణాకర్ భరద్వాజ ఆర్యాలకు కళ్యాణ విషయం చెప్పాను. ఆంధ్రజ్యోతిలో పని అయిపోయిన తర్వాత బయట ప్రశాంతంగా నడిచాను శ్రీరామ.

—----------

📖 21.01.2025 ✍️ 11240 (మంగళ)

🏡 కేంద్ర, ఆంధ్రజ్యోతి 


ఆంధ్రజ్యోతిలో నేను కరుణాకర్ మాత్రమే ధ్రువీకరణలు జరిపాము. పని తొందరగా అయిపోయింది, ఆఫీసులోనే వేగంగా తిరుగుతూ వ్యాయామం లాగా చేశాను శ్రీరామ.

—----------

📖 22.01.2025 ✍️ 11241 (బుధ)

🏡 కేంద్ర, ఆంధ్రజ్యోతి 


వికాస్ గారితో ప్రాతః స్మరణీయం చేసాను, బాగ్ లింగంపల్లి కేంద్రకు ఆటోలో వెళ్లి మైకు సెట్ ఇచ్చి బైకులో వచ్చాను శ్రీరామ.

—----------

📖 23.01.2025 ✍️ 11242 (గురు)

🏡 కేంద్ర, ఆంధ్రజ్యోతి 


వికాస్ గారితో ప్రాతః స్మరణీయం చేసాను, తరువాత సనతనగర్ డీ-మార్టు వెళ్లి నూనె, సాంబ్రాణి అవి తెచ్చుకున్నాను. ఓంకారం ముందు కూర్చుని పాటలు విన్నాను. మహా కుంభమేళా రైల్వే ప్రకటన వల్ల ఆలస్యమైంది. యజ్ఞ కోసం బెంగళూరు ప్రయాణం నిశ్చయం అయ్యింది శ్రీరామ.

—----------

📖 24.01.2025 ✍️ 11243 (శుక్ర)

🏡 కేంద్ర, ఆంధ్రజ్యోతి, బెంగళూరు బస్సు


వికాస్ గారు లేకుండా ప్రాతః స్మరణీయం చేసుకొని, రత్నదీప్ వెళ్లి తేనె అనూస్ షాంపూ తీసుకొని, కుమార్ షర్ట్ వెళ్లి బట్టలు కొనుక్కొని, కాఫీ తాగి ఆంధ్రజ్యోతి కు వెళ్లాను. రామకృష్ణ గారు పెద్దమ్మ గుడి దగ్గర వదిలిన తర్వాత రైలులో అమీరపేటలో బస్సు ఎక్కి బెంగళూరుకు బయలుదేరాను శ్రీరామ.

—----------

📖 25.01.2025 ✍️ 11244 (శని)

🏡 బెంగళూరు బస్సు, వాజరహళ్లి, బావ ఇల్లు, ప్రియక్క ఇల్లు, తిరగడం


ఉ.10.00కు కార్పొరేషన్ సర్కిల్ దగ్గర దిగి, కెంపుగడ్డ బస్సు ఎక్కి, అక్కడినుంచి మెట్రోలో వెళ్లి వాజరహళ్లిలో బావను కలిసి, అల్పాహారం తిని పార్లల్ వెళ్లి క్షవరాది కార్యాలు ముగించి ప్రియక్క దగ్గర యజ్ఞశ్రీను కలిసి తిరుగుతూ మాట్లాడుకున్నాను. ఆ సమయంలో సంభాషణలు సానుకూలంగా అనిపించాయి. 

ఇంటికి వచ్చిన తర్వాత మాటలు కార్పొరేట్ జీవనశైలికి సంబంధించి వచ్చిన చర్చలు, తన షూటింగ్ క్రీడ చర్చలలో వివాహానికి విరామం ఇస్తే బాగుంటుంది అన్న సలహా సైతం ఇచ్చాను. ఆ సమయంలో కొంచెం దూరం అవుతున్నట్లు అనిపించింది. 

రాత్రి తన నుంచి ఇది ఏమైనాప్పటికీ మన స్నేహితులుగా ఉందాం అని అనేసరికి, ఇక పెళ్లి కుదరదు అని అర్థమయ్యింది. ఇక హుందాగా తిరస్కారం స్వీకరించే ప్రయత్నం చేశాను. ఇబ్బంది అనిపించినప్పటికీ తేలిక అయ్యాను.

—----------

📖 26.01.2025 ✍️ 11245 (ఆది)

🏡 బావ ఇల్లు, హోటల్, బస్సు 


యజ్ఞ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్న ఉన్నాను. ప్రభాత ప్రణామాలు అందరికీ చెప్పి, పడుకొని లేచేసరికి తన స్పందన చూసి ఆనందించాను. 

కామధేనుకు వెళ్లి దోశ తిని, CBSE కు దరఖాస్తు చేసుకొని, సాయంత్రం బయటకు వెళ్లి మంచూరియా, దోశ తిని కాఫీ తాగి ఇంటికి వచ్చాము.

వాజరహల్లిలో మెట్రో ఎక్కి టిన్ ఫ్యాక్టరీకు వెళ్లి పాటలు వింటూ బస్సు కోసం ఎదురుచూస్తున్న ఉన్నాను.

—----------

📖 27.01.2025 ✍️ 11246 (సోమ)

🏡 కేంద్ర, ఆంధ్రజ్యోతి, రాజీవ్ నగర్ 


కేంద్రలో విడిగా సూర్య నమస్కారాలు చేసి, రవి అగ్రజులతో మాట్లాడి, ఆంధ్రజ్యోతికి వెళ్లాను. 

పెళ్లి రద్దు గురించి చెప్పాను. 

అలా బయట ప్రశాంతంగా నడిచాను.

—----------

📖 28.01.2025 ✍️ 11247 (మంగళ)

🏡 రాజీవ్ నగర్, ఆంధ్రజ్యోతి, కేంద్ర


మధ్యాహ్నం డిమార్ట్ కు వెళ్లి కరుణాకర్ కి ఇయర్ ఫోన్స్ తీసుకుని, ఆఫీసుకు వెళ్లాను.

—----------

📖 29.01.2025 ✍️ 11248 (బుధ)

🏡 కేంద్ర, మోతి నగర్, ఆంధ్రజ్యోతి, రాజీవ్ నగర్


ప్రాతః స్మరణీయం సూర్య నమస్కారాలు చేసి, జ్యోతక్క వాళ్ళ ఇంటికి బిందు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి, మధ్యాహ్నం ఆంధ్రజ్యోతి కి వెళ్లాను శ్రీరామ.

—----------

📖 30.01.2025 ✍️ 11249 (గురు)

🏡 రాజీవ్ నగర్, మోతి నగర్, ఆంధ్రజ్యోతి, కడప బస్సు,


బిందు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి, బాబాయ్ తో సుధ అత్తతో మాట్లాడాను. చెరువులు సరస్సులు గురించి చర్చ జరిగింది. 

జ్యోతక్క వాళ్ళ ఇంటి దగ్గరే బండి పెట్టి ఆంధ్రజ్యోతి కి వెళ్లి, రామకృష్ణ గారితో పంజాగుట్ట దగ్గర ఇది దిగి అమీరపేటలో బస్సు ఎక్కి కడపకు బయలుదేరాను శ్రీరామ.

—----------

📖 31.01.2025 ✍️ 11250 (శుక్ర)

🏡 ప్రస్థానం, మృదుల ఆస్పత్రి, తాటి బెల్లం కాఫీ, వైవీ స్ట్రీట్


ఏడు రోడ్ల దగ్గర దిగి ఎన్టీఆర్ కూడలి వద్ద ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాను. నాన్నకు శుభాకాంక్షలు తెలిపి స్వాతి, మామయ్య, బావ అత్తతో మాట్లాడిన తర్వాత, రెండు వాహనాలను మృదుల ఆసుపత్రికి వెళ్లాము. సహజ కాన్పు కోసంగా ప్రయత్నాలు జరిగినప్పటికీ, సిసిరింగ్ ద్వారా స్వాతికి ఆడపిల్ల మహాలక్ష్మి (ధృతి శ్రీ) పుట్టింది. బుజ్జి పాపాయి భలే ముద్దుగా ఉంది. 

తనని చూసి అందరం ఆస్వాదించాము శ్రీరామ.

No comments:

Post a Comment